టౌన్’లో మాయామశ్చీంద్ర
టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. నకిలీ ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవపల్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులు, దళారులు కుమ్మక్కై బాండ్ల కుంభకోణాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే బాండ్లు మారుబేరాలు సాగిపోవడం వివాదాస్పదమైంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు నాటి అధికారులకు చార్జి మెమోలు ఇవ్వాల్సిందిగా కమిషనర్ ఆదేశాలివ్వడంతో అక్రమార్కులు హడలెత్తుతున్నారు -విజయవాడ సెంట్రల్
వెలుగు చూసిందిలా..
టౌన్‌ప్లానింగ్ సేవల్ని ఆన్‌లైన్ చేశారు. ఈక్రమంలో గతంలో టీడీఆర్ బాండ్లు పొందిన యజమానులు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుండగా కొన్ని బాండ్లు గతంలో వినియోగించినట్లు తేలింది. తమకు తెలియకుండా బాండ్లు ఎలా వినియోగించారో తేలాలంటూ భవన నిర్మాణ యజమానులు కమిషనర్‌ను కోరారు. ఈమేరకు ఆయన ఫైళ్లను పరిశీలించగా స్కాం బయటపడింది. బందరు రోడ్డు విస్తరణలో భాగంగా 2012లో డి.సతీష్‌బాబుకు 89.16 చదరపు గజాలకు టీడీఆర్ బాండ్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసింది. సతీష్‌బాబుకు తెలియకుండానే సత్యనారాయణపురానికి చెందిన జి.రంగారావు (బీఏ నెంబర్ 1830/2015) జీప్లస్ 4కు వినియోగించారు. లబ్బీపేటకు చెందిన ఎం.తిరుపతికి 36.35 చదరపు గజాలకు బాండు మంజూరు చేయగా అయ్యప్పనగర్‌కు చెందిన ఎం.భవానీ (బీఏ నెంబర్ 2521/2013) వినియోగించినట్లు తేలింది. దీంతో బాండ్లు పొందిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

No comments:
Post a Comment